జయేంద్ర ఫార్ములా ఫలించేనా...?
న్యూఢిల్లీః
అయోధ్యవివాదానికి
పరిష్కారం
కనుగొనేందుకు
కంచికామకోటిపీఠాదిపతి
జయేంద్ర
సరస్వతి
సూచించిన
ఫార్ములా
పట్ల
ఎన్టీఏ
వర్గాలతో
పాటు
కాంగ్రెస్
పార్టీ
కూడా
ఆందోళన
వ్యక్తం
చేసింది.వివాదాస్పద
స్థలం
చుట్టూ
వున్న
స్థలంలో
ఆలయనిర్మాణాన్ని
అనుమతించాలనేది
వి.హెచ్.పి.
ప్రధాన
డిమాండ్.
ఈ
డిమాండ్
ను
ప్రభుత్వం
అంగీకరించడం
వల్ల
అనర్థాలు
తప్పవని
ఎన్టీఏ
ప్రధాన
భాగస్వాములైన
తెలుగుదేశం,
తృమమూల్
కాంగ్రెస్
అన్నాయి.
ఈ
వ్యవహారాన్ని
కోర్టులోనే
తేల్చాలని,
కోర్టుబయట
తేల్చుకోవాల్సి
పరిస్థితి
వచ్చినా
యథాతథ
స్థితికి
ఎటువంటి
భంగం
కలగరాదని
కాంగ్రెస్
అధికార
ప్రతినిధి
జైపాల్
రెడ్డి
అన్నారు.
యథాతథ
స్థితిని
కాపాడకుండా
తీసుకొనే
ఎటువంటి
నిర్ణయాన్నిఅయినా
తెలుగుదేశం
పార్టీ
వ్యతిరేకిస్తుందని
ఆ
పార్టీ
పార్లమెంటు
నాయకుడు
ఎర్రం
నాయుడు
అన్నారు.
దేశాన్ని
ముక్కలు
చేసే
వి.హెచ్.పి.
ప్రతిపాదననుఅంగీకరించలేదని,
తమ
నిరసనను
ప్రధానికివిన్నవిస్తామని
తృణమూల్
కాంగ్రెస్
నేత
మమతా
బెనర్జీ
అన్నారు.
జయేంద్రసరస్వతి
ప్రతిపాదనపై
చర్చిందేందుకు
ముస్లింపర్సనల్
లా
బోర్డు
అత్యవసర
సమావేశం
ఏర్పాటు
చేసింది.
తాజా
పరిణామాలపై
చర్చించేందుకు
జయేంద్రసరస్వతి
మంగళవారం
రాత్రి
ప్రధాని
వాజ్
పేయితో
మరో
సారి
సమావేశమయ్యారు.