మాజీ గవర్నర్ రఘునాథ రెడ్డి మృతి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసినకె.వి. రఘునాథ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఇక్కడి అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలో మృతి చెందారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
రఘునాథ రెడ్డి కొంత కాలం గుంటూరు, హైదరాబాద్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆన రాసిన పుస్తకం క్రిమినల్ లా ఇప్పటికీ న్యాయ శాస్త్రవిద్యార్థులకు రిఫెరెన్స్ పుస్తకం. ఆయన డెమొక్రటిక్ సోషలిజం అనే మరో పుస్తకం కూడారాశారు. ఆయన మృతికి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్, ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సి. రంగరాజన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications
