అరుంధతికి సుప్రీంకోర్టు శిక్ష
న్యూఢిల్లీః నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమనేత, ప్రముఖ రచయిత్రి అరుంధతిరాయ్‌కి కోర్టు ధిక్కారం కేసులో ఒకరోజు లాంఛనప్రాయ జైలు శిక్షను రెండు వేల రూపాయల జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె నేరపూరిత కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టుగా న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ పి పట్నాయక్, జస్టిస్ ఆర్‌పి సేథీలతో కూడిన డివిజన్ బెంచి పేర్కొంది. అఫిడవిట్‌లో ఆమెవ్యాఖ్యలు కోర్టు గౌరవానికి భంగం కలిగించేట్టుగా వున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.జరిమానా చెల్లించడానికి యిష్టపడని పక్షంలో అరుంధతి మరో రెండు నెలల జైలు శిక్షను అనుభవించాల్సివుంటుంది. వాక్ స్వాతంత్ర్యం అంటే కోర్టులకు వ్యతిరేకంగా చిత్తవచ్చినట్టుగా వ్యాఖ్యానించడం కాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటి కోర్టుల గౌరవం సన్నగిల్లుతుందని వారు అన్నారు.












Click it and Unblock the Notifications
