ఘనంగా బాలయోగి అంత్యక్రియలు

అమలాపురంః లక్షలాది మంది అభిమానుల అశ్రుతర్పణాల మధ్య దివంగత నేత బాలయోగి అంత్యక్రియలు అమలాపురంలో బుధవారం నాడు అధికార లాంఛనాలతో ఘనంగా జరిగాయి. ప్రధాని వాజ్‌పేయి, ప్రతిపక్షనేత సోనియాగాంధీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్‌ రంగరాజన్‌తో సహా పలువురు అగ్రశ్రేణి నేతలు అంత్యక్రియలకు హాజరై దివంగతనేతకు కడసారి నివాళులు అర్పించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు, అనధికార ప్రముఖులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. జోహార్‌ బాలయోగి, బాలయోగి అమర్‌ రహే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు చేస్తున్న నినాదాల మధ్య బాలయోగి కుమారుడు హరీష్‌ చితికి నిప్పంటించారు. వేదమంత్రాలతో హిందూ మత సంప్రదాయ ప్రకారం అంత్యక్రియల జరిగాయి.

మూడు వరసల్లో నిలబడినసైనికులు మూడు సార్లు తుపాకులను గాల్లొకి పేల్చి వందనం సమర్పించారు. అంత్యక్రియల కోసం తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగంఅయిదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి సిద్ధం చేసింది. ఈ స్థలాన్ని బాలయోగి స్మృతి చిహ్నంగాబ్రహ్మాండమైన పార్క్‌గా అభివృద్ధి చేస్తారు. మరో పదెకరాల స్థలాన్ని కూడా ఇక్కడే సమీకరిస్తారు. కోనసీమలోని ఒక కుగ్రామంలో పుట్టిన బాలయోగి పంచాయతీ రాజకీయాల నుంచి ప్రారంభించిన రాజకీయప్రస్థానంలో లోక్‌సభస్పీకర్‌ వరకు పలు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కోనసీమ అభివృద్ధి కోసం అనుక్షణం తపించిన బాలయోగి ఈ ప్రాంతం కోసం అనేక ప్రాజెక్టులు సాధించారు. బడుగువర్గాల అభ్యున్నతిని కాంక్షించిన నేతగా దళిత నాయకునిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభమైన బాలయోగి అంతిమయాత్రలో లక్షలాది మంది ప్రజలు కన్నీళ్లతో పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+