కరీంనగర్‌లో పేలుడుః 10మంది మృతి
హైదరాబాద్‌ః కరీంనగర్ జిల్లా వేములవాడకు సమీపంలోని కొడిముంజాల గ్రామంలో బుధవారం ఉదయం సంభవించిన భారీ పేలుడులో 10 మంది మరణించారు. మరో 15 మంది ఇంకా శిధిలాల కింద వున్నట్లు అనుమానిస్తున్నారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 40 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పేలుడు పదార్ధాల డీలర్ ఒకరు ట్రక్కులోపెద్దఎత్తున తెచ్చిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల లోడ్‌ను లారీనుంచి దింపుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. గ్రామంలోని బిసి కాలనీలో వున్న గోడౌన్లో నిల్వచేసేందుకు సదరు డీలర్ వాటిని అక్కడికి తెచ్చినట్టుగా చెబుతున్నారు. కొండలను పగలకొట్టేందుకు ఈ పేలుడు పదార్ధాలను ఉపయోగిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
