వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టువదలని కంచిస్వామి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్య వివాదం విషయంలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్రసరస్వతి ఢిల్లీలో మరో రోజు కూడా వుండి తన ప్రయత్నాలను కొనసాగించాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆయన బుధవారం నాడు కంచిపీఠానికి బయలుదేరాల్సివుంది.

అయితే తన మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు మరికొంత కృషి చేస్తే ఒక కొలిక్కి వచ్చే అవకాశం వున్నదని భావించడంతో ఆయన ఇంకోరోజు ఢిల్లీలో వుండిపోవాలని నిర్ణయించారు. ప్రధాని వాజ్‌పేయితో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా జరిపిన మంతనాలను గురించి ఆయన బుధవారం నాడు విహెచ్‌పి నేతలకువివరించారు.బుధవారం రాత్రి లేదా గురువారం నాడు ప్రధాని వాజ్‌పేయిని ఆయన మరోసారి కలిసే అవకాశం వుంది. కంచిస్వామి సూచించినట్టుగావివాదారహిత స్థలాన్ని తమకు అప్పగిస్తే వివాదంలో వున్న స్థలంజోలికి సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు వెళ్లమని హామీ ఇచ్చిన విహెచ్‌పి కోర్టు తీర్పుకు కట్టుబడి వ్యవహరిస్తామని మాత్రం చెప్పడం లేదు. మరోవైపు ముస్లింపర్సనల్‌ లా బోర్డు శంకరాచార్య సూచనలపై ఈ నెల 10న సమావేశమై చర్చించనున్నది. వారు కూడా విహెచ్‌పిని ఒకటి రెండువివరణలను కోరినట్టుగా తెలిసింది.అయోధ్యలోవివాదరహిత స్థలం రామజన్మభూమి న్యాస్‌కు చెందినదేనని దానిపైపేచీ పెట్టరాదని శంకరాచార్య వ్యక్తం చేసిన అభిప్రాయంతో ముస్లిం ప్రతినిధులు ఏకీభవించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X