జనసముద్రంగా మారిన కోనసీమ
అమలాపురంః దివంగత నేత లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, కడసారిగా ఆయన్ను దర్శించుకునేందుకు దేశం నలుమూలలనుంచి ప్రముఖులు అమలాపురం చేరుకుంటున్నారు. ప్రముఖుల ఆగమనంతోనూ కోస్తాంధ్రలోని వివిధ జిల్లాలనుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలు, అభిమానులతోనూ గోదావరి రెండుపాయల మధ్య వున్న కోనసీమ జనసంద్రంగా మారింది. ప్రధాని వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, లోక్‌సభ సెక్రటరీ జనరల్ మల్హోత్ర, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ సయీద్, రాజ్యసభ ఉపసభాపతి నజ్మాహెఫ్తుల్లా ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
