వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపిలో ఎస్‌పి ఎమ్మెల్యే కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను గవర్నర్‌ విష్ణుకాంత్‌ శాస్త్రి ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ సమాజ్‌వాది పార్టీ బుధవారం నాడు నిర్వహించిన ప్రదర్శన హింసాత్మకమైన మలుపు తీసుకున్నది. రాజ్‌భవన్‌ ముందు ప్రదర్శన జరుగుతుండగా గుర్తుతెలియని ఇద్దరు యువకులు పార్టీ ఎమ్మెల్యే మంజూర్‌ అహ్మద్‌ను సమీపం నుంచి రివాల్వర్‌తో కాల్చిచంపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మంజూర్‌ అహ్మద్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లుతుండగా మార్గం మధ్యలోనే మరణించారు.

ఈ సంఘటన ప్రదర్శనలో వున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, నాయకులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచింది. మంజూర్‌ అహ్మద్‌పై కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరు తప్పించుకోగా మరొకరిని పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకుఅప్పగించారు. పట్టుబడిన వ్యక్తిన భరద్వాజ్‌గా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత కూడా ఎస్‌పి నాయకులు రాజ్‌భవన్‌ ముందు ప్రదర్శన కొనసాగించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్‌ ప్రధాన ద్వారం నుంచి వచ్చిన వారే తమ ఎమ్మెల్యేపై కాల్పులు జరిపి హతమార్చినట్టుగా ఎస్‌పి ఆరోపిస్తున్నది. ఈ సంఘటనను పూర్తిస్థాయిలో రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి ఎస్‌పి ప్రయత్నించే అవకాశం వున్నందున పరిస్థితి ఎటు దారితీస్తుందోనని అధికార యంత్రాంగం భయపడుతున్నది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X