ప్రత్యూషకేసులో మంత్రుల అబ్బాయిలు లేరు
హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యుషకేసుపై గురువారం అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ కేసులో ఇద్దరు మంత్రుల కుమారులు వున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వార్తా పత్రికలు రాసిన వార్తలను ప్రతిపక్ష నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి చదివివినిపించారు. ఈకేసులో పోలీసులు, కేర్ అధికారులు నిజాన్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్ని పార్టీలువిమర్శించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు జోక్యం చేసుకొని ప్రతిపక్షాలు ఈ కేసులో బాధ్యతారహతంగామాట్లాడుతు న్నాయన్నారు. ప్రత్యూష ప్రియుడు, ప్రస్తుతం కేర్ లో కోలుకుంటున్న సిద్దార్థరెడ్డి కాంగ్రెస్‌సీనియర్ నాయకుడు మైసూరారెడ్డి మేనల్లుడని మొదట పుకార్లు పుట్టించారని, ఆ తరువాతవిచారణ జరిపిస్తే అతను మైసూరారెడ్డి బంధువు కాదని తేలిందన్నారు.












Click it and Unblock the Notifications
