యుపి, గుజరాత్‌పై పార్లమెంట్‌లో రభస

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆ రాష్ట్ర గవర్నర్‌ సిఫారసు, లక్నోలో ఎస్‌పి ఎమ్మెల్యే కాల్చివేత, గుజరాత్‌ మతకల్లోలాలపై గురువారం నాడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. సభా కార్యక్రమాలు ముందుకుసాగకపోవడంతో డిప్యూటీ స్పీకర్‌ సయీద్‌ మొదట లోక్‌సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి ఆయన వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ అదే పరిస్థితి కనిపించింది. సభాపతి కృష్ణకాంత పలుమార్లువిజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు యుపి, గుజరాత్‌ పరిణామాలపై చర్చకు పట్టుబట్టారు.స్పీకర్‌ జిఎంసి బాలయోగి మృతి వల్ల గత మూడు రోజులు వాయిదా పడిన సభ గురువారం నాడు సమావేశం కాగానే కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన సభ్యులకు సభ సంతాపం తెలియగానే గొడవ ప్రారంభమైంది. గుజరాత్‌ కల్లోలానికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అద్వానీ రాజీనామా చేయాలని, గుజరాత్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సభ్యులు నినాదాలు చేశారు. సభను వాయిదా వేసిన తర్వాతవిపక్ష సభ్యులంతా బయటకు వచ్చి పార్లమెంట్‌ ఎదుట ధర్నా జరిపారు. అద్వానీ రాజీనామా చేయాలని, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలోవిఫలమైన గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడి రాజీనామా చేయాలని సభ్యులు డిమాండ్‌ చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+