అహ్మదాబాద్‌ః మతకల్లోలాల్లో వందలాది మంది నేలకొరిగిన గుజరాత్ రాష్ట్రంలో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి బయలుదేరిన అఖిల పక్ష బృందం శుక్రవారం నాడు గోద్రా సందర్శించింది.
గోద్రాలో జరిగినసబర్మతి రైలు దహనకాండలో 60 మంది రామజన్మభూమి కరసేవకులు ఆహుతైన విషయంవిదితమే. గోద్రాలో పరిస్థితిని స్వయంగా చూడ్డంతోపాటు పలువురితో మాట్లాడిన అనంతరం అఖిలపక్ష బృందం అహ్మదాబాద్‌కు బయలుదేరింది.అహ్మదాబాద్‌లోకూడా బాధితులను పరామర్శిస్తారు. ఈ బృందంలోకాంగ్రెస్ నేత సోనియాగాంధి, సిపిఎం నేత సోమనాథ్‌చటర్జీ, సిపిఐ నాయకుడు బర్ధన్, టిడిఎల్‌పినేత ఎర్రన్నాయుడు, కేంద్ర మంత్రి ప్రమోద్‌మహాజన్‌తదితరులు వున్నారు. అఖిలపక్ష బృందం పర్యటనసందర్భంగా గుజరాత్‌లో భారీ ఎత్తునభద్రతా ఏర్పాట్లు చేశారు.