వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రిజర్వేషన్లఅంశంపై రభస సృష్టించిన 38 మంది ప్రతిపక్ష ఎమ్మెల్ల్యేలనుస్పీకర్‌ ప్రతిభా భారతి ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ప్రైవేట్‌ సంస్థలల్లో కూడా రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేసేవిషయంపై అధికారపక్షంతో పాటు అన్ని ప్రతిపక్షాలు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలంటూ తెలుగుదేశం ఎమ్మెల్ల్యేస్వామి దాసు చేసిన విజ్ఞప్తి పెను దుమారం సృష్టించింది.అప్పటివరకు ఎస్‌.సి.ఎస్‌.టి రిజర్వేషన్లు పెంచేఅంశంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ సభ్యులుస్వామిదాసు విజ్ఞప్తితో రెచ్చిపోయి ప్రవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఆ వ్యవహారం రాష్ట్రం పరిధిలోకి రాదని, కేంద్రం పరిధిలోనిదని భారీనీటిపారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని శ్రీహరి అన్నారు. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ సోనియాగాంధీ తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రావడంసిగ్గుచేటని కాంగ్రెస్‌ సభ్యులువిమర్శించారు. ఓ దశలో బిజెపి సభ్యులు, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వివాదం కూడా జరిగింది.
సభ్యులు ఎంతకూ శాంతించకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేసినస్పీకర్‌ ఆ తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో రభస సృష్టిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్ల్యేలందరినీ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.వీరితో పాటు సిపిఎం, ఎం.ఐ.ఎ. సభ్యులు కూడా సస్పెండ్‌అయిన వారిలో వున్నారు. స్పీకర్‌ చర్యకు నిరసనగాఎం.ఐ.ఎ., సిపిఎం సభపక్ష నేతలు అసదుద్దీన్‌ ఒవైసీ, నోముల నర్సయ్య సభ నుంచి వాకౌట్‌ చేశారు.

రిజర్వేషన్లపై దద్దరిల్లిన అసెంబ్లీ
ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్ల వ్యవహారంపై అసెంబ్లీలో శుక్రవారం నాడు తీవ్రస్థాయిలోదుమారం చెలరేగింది. సభ సమావేశంకాగానే రెండో ప్రశ్న కింద ఈ అంశాన్ని సభలోకాంగ్రెస్‌ లేవనెత్తింది. ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రస్తుతమున్నరిజర్వేషన్ల శాతాన్ని పదిహేను నుంచి ఇరువైరెండు శాతానికి పెంచడంపై,రిజర్వేషన్లను ప్రైవేట్‌ రంగానికి విస్తరించడంపై సభలోచర్చ జరగాలని సభ ఈ విషయంపై ఒక తీర్మానంచేయాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌చేశారు.
అయితే తీర్మానానికి తెలుగుదేశం, బిజెపి పార్టీలు తిరస్కరించడంతో సభలో సుమారు రెండున్నర గంటలసేపు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. దళితులకు రిజర్వేషన్ల కల్పనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముందున్నదని ఈవిషయంలో తాము ఎవరినుంచీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రిజర్వేషన్ల శాతం పెంచడానికి సంబంధించినఅంశం ప్రస్తుతం పార్లమెంట్‌లో వున్నదని ఆయన చెప్పారు. ఈ దశలోఅసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆయన వెల్లడించారు. తీర్మానాలు చేసి చేతులు కడుక్కోవడం దళితుల పట్ల ద్రోహం అవుతుందని ఈవిషయంలో కాంగ్రెస్‌ కంటే తాము ముందు భాగంలో వున్నామని తెలుగుదేశం మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఇది పూర్తిగా పార్లమెంట్‌కు సంబంధించినఅంశమని ఈ విషయంలో కేంద్రంపై తాము వత్తిడి తెస్తునే వున్నామని ఆయన చెప్పారు. కాగా ప్రైవేట్‌ రంగంలో దళితుల రిజర్వేషన్‌ కేంద్రానికి సంబంధించినఅంశమేనని, పార్లమెంట్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈవిషయం లేవనెత్తిన రాష్ట్రపతిని అభినందిస్తూ, రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలన్నదే తమ డిమాండ్‌ అని కాంగ్రెస్‌ సభ్యులు చెప్పారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీనే ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నదని తెలుగుదేశం, బిజెపి నేతలు దుయ్యబట్టడంతో సభలో తీవ్రమైన గొడవ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X