ముషారఫ్‌కు బుష్‌ హితవు

వాషింగ్టన్‌ః భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాల్సిందిగా పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ హితవు చెప్పారు. అర్ధవంతమైన చర్చలకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధికార ప్రతినిధి విలేకరుల సమావేశంలో చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాల్సిందిగా పాకిస్తాన్‌ నేత ముషారఫ్‌కు పలు మార్లు బుష్‌ స్వయంగా చెప్పారని ఆయన వెల్లడించారు.

ముషారఫ్‌ కూడా అమెరికా సూచననుఅంగీకరించారని ఆయన చెప్పారు. అమెరికా సలహా వినకుండా ముషారఫ్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఆయన తమకు ముఖ్యమైన మిత్రుడని ఆయన మాటలను తాము నమ్ముతున్నామని, ఒకవేళ మాట తప్పితే ఆయనకే సమస్యలు వస్తాయని అమెరికా ప్రతినిధి వ్యాఖ్యానించారు. భారత సమాచార శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లడాన్ని అమెరికా శ్లాఘించింది. ద్వైపాక్షిక సంబంధాలవిషయంలో ప్రధాని వాజ్‌పేయి ఆసక్తి కి ఇది నిదర్శనమని అమెరికా వ్యాఖ్యానించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+