నరమేధంచేస్తున్న పాక్‌తో క్రికెట్ ఆడేదెలా?
న్యూఢిల్లీః పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తి లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఓ చేత్తో నిండుప్రాణాలను బలితీసుకుంటూ మరో చేత్తోస్నేహహస్తం చాపితే భారత్ అందుకు అంగీకరించదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. పాకిస్తాన్‌టెస్ట్ క్రికెట్ ఆడడం ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున క్రికెట్ ఉత్సవం జరపాలని పాక్ నిర్ణయించింది.... భారత్ ను కూడా ఆహ్వానించాలని పాక్ నిర్ణయించిందని లాహోర్ నుంచి వార్తలు వచ్చాయి.
భారత్ పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడాలంటేటెస్ట్ క్రికెట్ ఉత్సవాల్లో భారత్ మాతో క్రికెట్ ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ తాకిర్ జియా శనివారం లాహోర్ లో వ్యాఖ్యానించారు. కార్గిలా పోరాటం దరిమిలా సుమారు రెండేళ్ళుగా భారత్ పాకిస్తాన్ లో క్రికెట్ ఆడనివిషయం విదితమే.












Click it and Unblock the Notifications
