న్యూఢిల్లీః అయోధ్య పై నెలకొన్న ప్రతిష్టంభనను తొలిగించి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించేందుకు రంగంలోకి దిగిన కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి దౌత్యం సఫలమైంది.
శుక్రవారం నాడు ఆయన తిరిగి చెన్నై బయలుదేరి వెళ్లారు. ముందుగా నిర్ణయించినట్టుగా మార్చి 15న అయోధ్యలో పూజ జరుగుతుందని ఆ తర్వాతవివాదరహిత స్థలంలో జూన్ 2 నుంచి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని చెన్నైలోవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంచిస్వామి చెప్పారు. కోర్టు తీర్పునకు కట్టుబడి వుంటామని విహెచ్‌పి అంగీకరించడంతో పీటముడి తొలిగిపోయినట్టయింది. ముస్లిం మత ప్రతినిధులు సైతం శంకరాచార్య రాజీ మార్గం పట్ల సముఖంగానే వున్నారు. గురువారం నాడు ప్రత్యేకవిమానంలో గుజరాత్‌కు వెళ్లి బాధిత ప్రాంతాలను దర్శించి వచ్చిన జయేంద్రసరస్వతి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో వెళ్లి మరోసారి ప్రధాని వాజ్‌పేయితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. జయేంద్ర సూచించిన పరిష్కారానికిఅంతా అంగీకరించినట్టుగా తెలిసింది. ఢిల్లీలో నాలుగురోజులన్న జయేంద్ర సుమారు మూడు సార్లు జయేంద్రతో సమావేశమయ్యారు.