లోక్ సభలో పోటో బిల్లు
న్యూఢిల్లీః ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ శుక్రవారం లోక్ సభలో తీవ్రవాద నిరోధక చట్టం(పోటో) బిల్లును ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద నిరోధ చట్టాలకు పదును పెడుతున్న ప్రస్తుత తరుణంలో మనం బూజుపట్టిన చట్టాలతో ఏం చేయలేమని అద్వానీ అన్నారు. టాడా లాగా ఈ చట్టం దుర్వినియోగం కాదని ఆయన సభకు హామీ ఇచ్చారు.
పోటో బిల్లును ప్రవేశపెట్టినందుకు నిరసనగా అన్నాడిఎంకె, సమాజ్ వాది పార్టీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అన్నా డిఎంకె వామపక్షాల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications
