న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్ వ్యవహారం శుక్రవారం నాడు కూడా లోక్‌సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. లక్నోలో రాజ్‌భవన్ ఎదురుగానే తమ పార్టీ ఎమ్మెల్యే దారుణ హత్యకు గురున సంఘటనపై సమాజ్‌వాది పార్టీ సభ్యులు చెలరేగిపోయారు.
ఈ సంఘటనపై చర్చకు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను వారు స్తంభింప జేశారు.స్పీకర్ స్థానంలో వున్న సయీద్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన వారువినిపించుకోలేదు. సభ మధ్య భాగంలోకి దూసుకువచ్చి గొడవ ప్రారంభించారు. దాంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.