మరోదారి లేకే రాష్ట్రపతిపాలనః వాజ్‌పేయి
న్యూఢిల్లీః విధిలేని పరిస్థితుల్లోనే ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని ప్రధాని వాజ్ పేయి పార్లమెంటులో స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అన్యాయంగా రాష్ట్రపతి పాలన విధించారంటూ ప్రతిపక్షాలు శుక్రవారం లోక్ సభ, రాజ్యసభలో రభస సృష్టించారు. ఈ అంశంపై వాజ్ పేయి ప్రత్యేకంగా సభకు వచ్చి ప్రకటన చేశారు. సమాజ్ వాది పార్టీ అధిక స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చాలినంత మెజారిటీ లేదన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ విష్ణుకాంత్ శాస్త్రి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం పూర్తిగా సమర్ధనీయమని వాజ్ పేయి అన్నారు.












Click it and Unblock the Notifications
