న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి 15న విహెచ్‌పి తలపెట్టిన పూజకు అనుమతినివ్వాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలిసింది. అదేవిధంగా అయోధ్యలో కరసేవకుల కదలికలపై విధించిన ఆంక్షలను కూడా సడలించాలని నిర్ణయించారు.
అయోధ్యలో హోం శాఖ సహాయ మంత్రి ఐడిస్వామి శుక్రవారం నాడు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఆంక్షల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అయోధ్యలో పరిస్థితి అదుపు తప్పకుండాసైన్యాన్ని మొహరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈవిషయం కేంద్ర రక్షణ మంత్రి జార్జ్ చెప్పారు. అయోధ్యలో మార్చి 15 నుంచివిశ్వహిందూ పరిషత్ యాగం నిర్వహిస్తున్నందునసైన్యాన్ని మొహరించాలని యుపి సర్కారు కేంద్రాన్ని కోరినట్టుగా ఆయన వెల్లడించారు.