గ్యాస్, కిరొసిన్ పై మెత్తపడుతున్న సిన్హా
న్యూఢిల్లీః కోట్లాది మంది భారతీయుల నెలసరిబడ్జెట్ కు చిల్లు పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తీసుకున్న నిర్ణయంపై వాజ్‌పేయి ప్రభుత్వం కాస్త మెతబడిన సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ ధరను 40 రూపాయలు, కిరొసిన్ ధరను లీటర్ కు రూపాయిన్నర చొప్పున పెంచుతున్నట్లు యశ్వంత్ సిన్హా ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తంఅయింది. చివరకు అధికార బిజెపి పార్టీలో కూడా నిరసన వ్యక్తంఅయింది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు యశ్వంత్ సిన్హా ప్రధాని వాజ్‌పేయితో చర్చించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
