న్యూఢిల్లీః సరిహద్దుల్లో సైనిక దళాల మొహరింపు కొనసాగుతుందని రక్షణ శాఖ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్ స్పష్టం చేశారు. భారత్ షరతులను పాకిస్తాన్ నెరవేర్చేవరకు సరిహద్దుల్లో భారత బలగాల మొహరింపు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
భారత్ సరిహద్దులనుంచిసైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా పాకిస్తాన్ చేసిన ప్రకటనను ఆయన కొట్టివేశారు. నౌకాదళం ఏర్పాటు చేసి ఒకసెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. పాకిస్తాన్‌ను ఉటంకిస్తూ వచ్చిన వార్తల గురించివిలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత్ కోరిన విధంగా 20 మంది ఉగ్రవాదులనుఅప్పగించిన తర్వాతనే సరిహద్దుల నుంచిసైన్యాన్ని ఉపసంహరించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.