రాజ్యసభకు మళ్ళీ శత్రుఘన్ సిన్హా
న్యూఢిల్లీః ప్రముఖ హిందీ నటుడు శత్రుఘన్ సిన్హా, బిజెపి అధ్యక్షుడు జానా కృష్ణమూర్తిని రాజ్యసభకు బిజెపి ఎంపిక చేసింది. సిన్హాను బీహార్ నుంచి, జానాను గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్లు బిజెపి శనివారం ప్రకటించింది. కొద్దిరోజులుగా బిజెపి అధిష్ఠానంతో ఎడమొఖం పెడముఖంగా వున్న శత్రుఘన్ సిన్హాను కూడా రాజ్యసభకు ఎంపికచేయడం విశేషం. కాస్త జనాకర్షణ వున్న నేతలు లేక ఒట్టిపోయిన పార్టీకి శత్రుఘన్ ను కూడా దూరం చేసుకుంటే కష్టాలు తప్పవనే ఉద్దేశంగా ఆయనను తిరిగి రాజ్యసభకు ఎంపిక చేశారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
