జయేంద్ర ఫార్ములకు ముస్లింబోర్డు నో

న్యూఢిల్లీః అయోధ్య వివాద పరిష్కారానికి కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేసిన ప్రతిపాదనలను ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తిరస్కరించింది. వివాదరహిత స్థలంలో రామాలయాన్ని నిర్మించుకొనేందుకు అనుమతించాలని, అందులో భాగంగా మార్చి 15న భూమి పూజ నిర్వహించుకొనేందుకు అనుమతించాలని జయేంద్ర సరస్వతిప్రతిపాదించారు. అయితే జయేంద్ర ప్రతివాదనలను అనుతించేందుకు తాము సిద్ధంగా లేమని ఆదివారం కొత్తఢిల్లీలో ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశంమైన ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తేల్చి చెప్పింది.

బాబ్రీమసీదును బేరానికి పెట్టడం కాని, దానంచేయడం కానీ, తెగనమ్మేందుకు కానీ ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని బాబ్రీమసీదు యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ షాబుద్దీని అన్నారు. జయేంద్రసరస్వతి కొత్తగా ప్రతిపాదించింది ఏమీ లేదని 1989 నుంచి వి.హెచ్‌.పి. ఇదే చెబుతున్నదని ఆయన అన్నారు. మరేదైనా ప్రతిపాదనతో వస్తే ప్రభుత్వంతో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామని షాబుద్దీన్‌ చెప్పారు. మార్చి 15న భూమి పూజ చేసుకొనేందుకు వాజ్‌పేయి అనుమతించరనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అయోధ్య వ్యవహారంపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీసుకొనే నిర్ణయాలు తమకు సమ్మతం కాదంటూ సమావేశ మందిరం వెలుపల పలు ముస్లిం సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. బాబ్రీమసీదునువిశ్వహిందూ పరిషత్‌ కు ధారదత్తం చేస్తే సహించేది లేదని వందలాది కార్యకర్తలు నినాదాలిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+