దిగివస్తేనే పాక్ తో చర్చలుః సుష్మా
ఇస్లామాబాద్‌ః సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మానుకోవడంతో పాటు భారత్‌అప్పగించాల్సిందిగా కోరిన 20 మంది తీవ్రవాదుల్లో కనీసం 7 నుంచి 10 మందినైనాఅప్పగిస్తేనే పాక్ తో చర్చలు జరుపుతామని భారత్ స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వైఖరిని కనీసం 30 నుంచి 50 శాతం తగ్గించాలని, భారత్ కోరిన 20 మంది నేరగాళ్ళలో కనీసం 7 నుంచి 10 మందినిఅప్పగిస్తే పాక్ తో చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తామని భారత్ సమాచార ప్రసారశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పాక్ పత్రిక ది న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ముషారఫ్ కొన్ని చర్యలు తీసుకున్నవిషయాన్ని ప్రస్తావించగా కాశ్మీర్ లో జరుగుతున్న నరమేధాన్నిస్వాతంత్ర్య సంగ్రామంగా ముషారఫ్ అభివర్ణిస్తున్నప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటే మాత్రం ఏం లాభం అను శుష్మాస్వరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications
