క్రికెట్: భారత్ ఘనవిజయం
మొహాలీ: జింబాబ్వేతో ఆదివారంనాడిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 64 పరుగుల తేడాతోవిజయం సాధించింది. భారత్ సమష్టి కృషితో ఈవిజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరువికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ తర్వాత రంగంలోకి దిగిన జింబాబ్వే 43.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలవుట్‌అయింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌరబ్ గంగూలీ, దినేష్ మోంగియా ధాటిగా బ్యాటింగ్ చేసి ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చేశారు. గంగూలీ 86 బంతుల్లో మూడుసిక్స్‌లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేయగా, మోంగియా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చినవి.వి.యస్. లక్ష్మణ్ 52 పరుగులు చేశాడు. ద్రావిడ్ 66 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. దీంతో భారత్ 300 పరుగులను సునాయసంగా దాటింది.
భారత్ ఈ విజయం సాధించడంతో రెండు జట్లు చెరో మ్యాచ్ గెల్చుకుని 1-1తో ఉన్నాయి.












Click it and Unblock the Notifications
