ప్రత్యూష మరణించిందాః సిద్ధార్థ ప్రశ్న
హైదరాబాద్‌ః వర్ధమాన నటి ప్రత్యూష కేసులో కీలక సాక్షి, అనుమానితుడూ కూడా ఆయిన సిద్ధార్థ రెడ్డికి పాపం ప్రత్యూష ఏమయిందో ఇప్పటివరకూ తెలియదట? సోమవారం నాడు తొమ్మిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆనందరావు కోర్టులో సిఐడి పోలీసులు సిద్ధార్థరెడ్డిని హాజరుపర్చినప్పుడు హై డ్రామా నడిచింది. వివిఐపి ఎవరైనా అనూహ్యంగా క్రిమినల్ కేసులో ఇరక్కున్నప్పుడు కోర్టులో హాజరుపర్చే సమయంలో ఏవిధంగా ప్రవర్తిస్తారో పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారు.విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సిద్ధార్థ దరిదాపుల్లోకి కూడా రాకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ఆనందరావు కూడా ఈ కేసులో పోలీసులు వైఖరిని మెత్తగా మందలించారు. కేసులో నిందితున్ని ప్రశ్నించే విషయంలో అనుమానితులను అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసుల ప్రవర్తనను ఆక్షేపించారు. ఈ నెల 20వరుకు సిద్ధార్ధను జుడిషియల్ కస్టడీలో వుంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించిన తర్వాత కోర్టునుంచి సిద్ధార్థరెడ్డిని చంచల్‌గూడా జైలుకు తరలించారు. కోర్టు ఆవరణలో సిద్ధార్థతో మాట్లాడేందుకు విఫల ప్రయత్నం చేసిన విలేకరులు ఎట్టకేలకు చంచల్‌గూడా దగ్గర సిద్ధార్థతో మాట్లాడించగలిగారు. తమ ప్రేమను మొదట్లో ఇద్దరి ఇళ్లలో
అంగీకరించలేదని అయితే ప్రత్యూష్ ఇంట్లో ఆ తర్వాత ఒప్పుకున్నా తమ ఇంట్లో మాత్రం అంగీకరించలేదని సిద్ధార్థ చెప్పాడు.












Click it and Unblock the Notifications
