అయోధ్యపై తెలుగుదేశం హెచ్చరిక
న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి పదిహేనున విహెచ్‌పి తలపెట్టిన పూజాకార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
పార్టీల నేతలు కోరారు. కోర్టు తీర్పు రాకుండా ప్రభుత్వంస్వాధీనం చేసుకున్న భూమిలో ఏ పక్షానికి ఏలాంటి కార్యక్రమం చేపట్టేందుకు అనుమతినిచ్చేది లేదని ప్రధాని లోక్‌సభలో ప్రకటించినప్పటికీ ఈవిషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగిపోలేదని టిడిపిపి నేత ఎర్రన్నాయుడు అన్నారు. హోం మంత్రి అద్వానీ జారీ చేసినట్టుగా చెబుతున్న ఆదేశాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో యథాతథ స్థితిని కాపాడేవిషయంలో సందేహాలకు తావులేకుండా ప్రభుత్వం తన విధానాన్నివిస్పష్టంగా ప్రకటించాలని ఆయన కోరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ కూడా దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అయోధ్యలో యథాతథ స్థితికి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో రామసేవకులపై జరిగిన కాల్పులను ఆమె తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు లోక్‌సభలో అయోధ్యపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలోనే వాగ్యుద్ధం జరిగింది.












Click it and Unblock the Notifications
