అయోధ్యలో విహెచ్‌పి ప్రార్ధనలు

అయోధ్యః మార్చి 15న ఎట్టిపరిస్థితిలోనూ పూజలు నిర్వహిస్తామని ప్రకటించిన విశ్వహిందూపరిషత్‌ సోమవారం నాడు ఈ పూజలకు నాంది పలికింది. రామజన్మభూమి న్యాస్‌, విశ్వహిందూపరిషత్‌ ఆధ్వర్యంలో గంటన్నర పాటు ప్రార్ధనలు జరిపారు.

ఆలయ నిర్మాణానికిఅసరమైన శిలాకృతులను రూపొందిస్తున్న వర్క్‌షాప్‌లో ఈ ప్రార్ధనలు జరిపారు. మార్చి 15న దేవాలయం గర్భాలయం వద్దకు శిలలను తరలిస్తామని న్యాస్‌ అధ్యక్షుడు రామచంద్ర దాస్‌ పరమహంస ప్రకటించారు. ముస్లిములు మక్కాలో ప్రార్ధనలు జరిపినట్టే ప్రపంచంలోని హిందువులంతా రామజన్మభూమిలో ప్రార్ధనలు జరిపే హక్కు కలిగివున్నారని ఆయన తెలిపారు. రామజన్మభూమి ప్రదేశానికి వెళ్లేందుకు ఎవరి అనుమతీ తీసుకోవల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. విహెచ్‌పి నేతఅశోక్‌ సింఘాల్‌ కూడా మార్చి 15 కార్యక్రమంలో మార్పు లేదని స్పష్టం చేశారు. అడుగుడుగునా భద్రతా దళాలతో నిండిన అయోధ్యలో సింఘాల్‌ సోమవారం నాడే అడుగుపెట్టారు. సింఘాల్‌ రాకతో పరిస్థితి వేడెక్కినట్టుగా అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+