కొచ్చిలో భారత్‌ పరాజయం

కొచ్చిః జింబాబ్వేతో కేరళలోని కొచ్చిలో బుధవారం నాడు జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌తో ఆయిదు వన్డేల సిరీస్‌లో జింబాబ్వేకు 2-1 ఆధిక్యత లభించింది. బ్యాటింగ్‌ పిచ్‌గా పరిగణిస్తున్న కొచ్చిలో భారత జట్ట కాప్టెన్‌
సౌరవ్‌ గంగూలీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎన్నుకున్నారు. అయితే భారత బ్యాట్స్‌మెన్‌ జింబాబ్వే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు.

వరసగావికెట్లు కుప్పకూలాయి. తొలి పన్నెండు ఓవర్లలనో భారత్‌ 4వికెట్లు కోల్పొవడంతో భారత్‌ జట్టు విజయంపై అభిమానాలు ఆశలు వదులుకున్నారు. జింబాబ్వే తరఫున ఈ సిరీస్‌లో తొలిసారిగా రంగంలోకి దిగిన హోండో ఆరంభంతోనే వెంటవెంటనే మూడువికెట్లు తీయడం భారత్‌ను తీవ్రంగా కుంగదీసింది. భారత జట్టులోకైఫ్‌ ఒక్కడే అత్యధికంగా 56 పరుగులు చేశాడు. 48.3 ఓవర్లకే భారత్‌ 191 పరుగుల వద్ద ఆల్‌ ఔట్‌ కావడంతో జింబాబ్వే పంటపండిది. ఈస్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆటగాళ్లు పూర్తి విశ్వాసంతో ఆడి చేధించారు. 44 ఓవర్లలో చేతిలో ఇంకా ఆరువికెట్లు వుండగానే జింబాబ్వే విజయం సాధించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+