ఎన్‌కౌంటర్ మృతులు 11 మంది
వరంగల్: వరంగల్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ముక్కనూరు, తుపాకులగూడెం మధ్య గల దట్టమైన అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 11కుపెరిగింది. పోలీసులకు, పీపుల్స్‌వార్ నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్వాడ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ యు. సంజీవ్ మృతి చెందినవిషయం తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఒక నక్సల్స్‌ను తప్పమిగతావారినందరినీ గుర్తించారు. ఇద్దరు ప్లటూన్ కమాండర్లతో పాటు ఏటూరు నాగారం పోలీసుస్టేషన్ పేల్చివేతతో సంబంధం వున్న ఒక నక్సలైట్ మరణించాడు.పీపుల్స్‌వార్ ఖమ్మం ప్లటూన్ కమాండర్ బంగారు భాస్కర్ అలియాస్ దేవేందర్ అలియాస్ దేవన్న,పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఈస్ట్ జోన్ కమాండర్ ప్రభాకర్ అలియాస్ దండబోయిన జవహర్‌లాల్, ప్లాటూన్ సభ్యులుఅంజయ్య అలియాస్ బెంజిమన్, గంధం గజేందర్,స్వర్ణక్క, రజిత, మూల రమేష్ అలియాస్ రంజిత్ మృతి చెందినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications
