లక్నోః విహెచ్‌పి తలపెట్టిన పూజకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు నివ్వడంతో ముందుజాగ్రత్త చర్యగా అయోధ్యలో బుధవారం నాడు అదనంగా మరిన్ని దళాలను మొహరించారు. కొత్తగా పది కంపెనీల సిఆర్‌ఎఫ్ దళాలు వచ్చినట్టుగా తెలిసింది.
సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయోధ్యలో మొహరించిన భద్రతాదళ సిబ్బంది సంఖ్య పదివేలను దాటినట్టుగా అధికారులు చెప్పారు. ఈ సిబ్బందికి తోడుగాసైన్యాన్ని కూడా ఏ క్షణంలోనైనా రంగంలోకి దించడానికివీలుగా అప్రమత్తంగా వుంచారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేస్తామని హోం శాఖ అధికారులు ప్రకటించారు. కోర్టు ఆదేశాల ప్రకరం దర్శనానికి వెళ్లేవారిని తాము నిరోధించమని అదే సమయంలోవివాదాస్పద స్థలంలోకి శిలలను తీసుకుపోకుండా ఆపుతామని హోం శాఖ ప్రధాన కార్యదర్శి చెప్పారు.