విండీస్ టూర్ కు గంగూలీకే కెప్టెన్సీ
కోచిః వెస్టిండీస్ తో వచ్చేనెల నుంచి పర్యటించే భారత్ జట్టు కెప్టెన్సీ సౌరభ్ గంగూలీ నే వరించింది. గంగూలీ కెప్టెన్ గా కొనసాగుతాడని ఇండియన్ క్రికెట్ బోర్డు కార్యదర్శి నిరంజన్ షా బుధవారం ప్రకటించారు. కోచిలో ఇండియా- జింబాంబ్వే జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా బోర్డు సభ్యులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్డేలో బాగానే రాణిస్తున్న గంగూలీ టెస్టుల్లో దారుణంగావిఫలం అవుతూ వచ్చాడు. అయితే ఢిల్లీ టెస్ట్ లోసెంచరీ చేసి మళ్ళీ ఫాం లోకి రావడంతో అతనినే కెప్టెన్ గా కొనసాగించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications
