కేంద్రం వైఖరిపై మండిపడ్డవిపక్షం
న్యూఢిల్లీః అయోధ్యలో భూమి పూజకు అనుకూలంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదించడం పట్ల బుధవారం నాడు లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రధాని వాజ్‌పేయి తక్షణమే సభలో ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు సృష్టించిన గందరగోళం వల్ల లోక్‌సభను సభాపతి రెండు సార్లు వాయిదా వేశారు. న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసేందుకు ప్రయత్నించినా విపక్షాలు పట్టించుకోలేదు. సభ మధ్యలోకి దూసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధాని మాత్రమే ప్రకటన చేయాలని వారు పట్టుబట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వం యావత్ దేశాన్ని మోసం చేసిందని సమాజ్‌వాద్ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ముందుగా విపక్ష సభ్యులను మాట్లాడేందుకు అనుమతినిచ్చి ఆ తర్వాత ప్రధాని ప్రకటన చేయాలని లేదా ప్రధాని ప్రకటన చేసిన తర్వాతనైనా విపక్ష సభ్యులను మాట్లాడించాలని కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
