హైదరాబాద్‌ః నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరిపే విషయంలో పునరాలోచన లేదని హోం మంత్రి దేవేందర్ గౌడ్ ప్రకటించారు. చర్చలకు సంబంధించిన తేదీలను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.
ఎన్‌కౌంటర్లు చర్చలకు అడ్డు కాదని ఆయన చెప్పారు. విహెచ్‌పి అయోధ్యలో పూజలకు పట్టుదలగా వున్న నేపథ్యంలో మార్చి 15 శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదని హోం మంత్రి చెప్పారు. నగరంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నారు.