వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూషది ఆత్మహత్యే: కమిటీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సినీ నటి ప్రత్యూష కేసులో పోస్టుమార్టం డాక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పు అని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. ప్రత్యూష గొంతు నులుమడం వల్ల చనిపోలేదని,విషం సేవించడం వల్లనే మరణించిందని ఫోరెన్సిక్‌సైన్స్‌ లాబొరేటరీ ఇచ్చిన నివేదికను కమిటీ సమర్థించినట్లు సమాచారం.

గొంతు నులుమడం వల్ల ప్రత్యూష చనిపోయిందని గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ మునుస్వామిఅంటూ ఆమె అత్యాచారానికి గురై వుండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. దాంతోసెమెన్‌తో పాటు విస్రాను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీకిపంపారు. ఈ రెండింటినీ పరిశీలించిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ ఇవేమీ నిజం కాదని, ప్రత్యూషవిషం తీసుకోవడం వల్లనే చనిపోయిందని తేల్చింది.

గొంతుపైన, ఇతర చోట్ల గాయాలు ఉండడంపై కూడా పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చికిత్సలో భాగంగానే ఈ గాట్లుపెట్టినట్లు కేర్‌ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. మూడు నివేదికలు మూడు రకాలుగా వుండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముగ్గురు డాక్టర్లు నారాయణరెడ్డి,విజయకుమార్‌, సత్యవతిలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ మూడు నివేదికలను పరిశీలించి ఒక నివేదిక సమర్పించింది.

గొంతు నులిమితే గొంతు లోపలి ఎముకవిరిగిపోవాలని, ఈ ఎముక బాగానే వుందని పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ నివేదిక తెలియజేస్తోందని,అందువల్ల ప్రత్యూషను గొంతు నులిమి చంపారనడంలో నిజం లేదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. చికిత్సలో భాగంగా వివిధ చోట్లపెట్టిన గాట్లను డాక్టర్‌ గాయాలుగా పొరబడి వుండవచ్చునని కమిటీవివరించింది. అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయం తెలుసుకునేందుకువిశ్లేషణ కోసం డాక్టర్‌ మునుస్వామిని ఫ్లూయిడ్‌ను ఫోరెన్సిక్‌సైన్స్‌ లాబొరేటరీకి పంపారు. అయితే అందులో వీర్యకణాలేవీ లేవని లాబొరేటరీ తేల్చింది. ఈ అభిప్రాయంతో కమిటీ ఏకీభవిస్తూ ప్రత్యూషపై అత్యాచారం జరగలేదని తేల్చింది.

వెనక్కు తగ్గని మునుస్వామి

తన నిర్ణయం విషయంలో డాక్టర్‌ మునుస్వామి వెనక్కి తగ్గడం లేదు. తన నిర్ణయాన్ని ఆయన సమర్థించుకుంటున్నారు. ఒరిజనల్‌ కేసుషీటు, ఫొటో నెగెటివ్‌లు తనకు ఇవ్వాలని ఆయన పోలీసులను కోరుతున్నారు. గతంలో కుషాయిగూడాలో పద్మావతి
అనే మహిళ మృతి చెందినప్పుడు ఆమె ఉరి వేసుకుని చనిపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఆమెది హత్యేనని మునుస్వామి పోస్టుమార్టంలో తేల్చారు. దీంతోపోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎన్నో కేసులను పోస్టుమార్టం చేసిన తాను ప్రత్యూష కేసులో ఎలా పొరపాటు చేస్తానని ఆయన ప్రశ్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X