పూజ చేయం.... రాళ్ళు తరలిస్తాం
అయోధ్యః మార్చి 15న ఆలయ నిర్మాణం కోసం చెక్కిన రాళ్ళను నిర్మాణ స్థలానికి తరలిస్తామని రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు రామచంద్రదాస్ పరమహంస స్పష్టం చేశారు. పూజ కానీ, శిలాన్యాసం కానీ నిర్వహించరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని నిర్మాణానికి ఉద్దేశించిన రాళ్ళను అక్కడికి తరలించ వద్దనలేదని ఆయన బుధవారం అయోధ్యలో అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే పరమహంసవిలేకరులతో మాట్లాడుతూ మార్చి 15న ఆలయం కోసం చెక్కిన రాళ్ళతో అధికారులు అనుమతించినంత దూరం వెళతామని స్పష్టం చేశారు. కేవలం రాళ్ళు తరలిస్తామని భూమి పూజ కానీ, శిలాన్యాస్ కానీ చేయమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
