హైదరాబాద్‌ః ఆదాయం పెంచుకోవడానికి వీలుగా మున్సిపాల్టీలు ఆస్తిపన్ను పెంచుకోవచ్చంటూ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అనుమతినివ్వడాన్ని అసెంబ్లీలో శుక్రవారం నాడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, మజ్లిస్, సిపిఎంతో పాటు మిత్రపక్షమైన బిజెపి కూడా కోరింది. ఈ ఉత్తర్వుల వల్ల ఆదాయం పెరగడం మాట అటుంచి అవినీతి పెరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే మున్సిపల్ మంత్రి ఫరూఖ్ ఉత్తర్వులు ఉపసంహరణకు అంగీకరించకపోవడంతోపెద్దఎత్తున గొడవ చెలరేగింది. దాంతో ప్యానెల్‌స్పీకర్ సభను వాయిదా వేశారు.