ప్రత్యూష కేసులోఆసరా

హైదరాబాద్‌: సినీ నటి ప్రత్యూష కేసునుఆసరా అనే సంస్థ చేపట్టింది. చలన చిత్రరంగం, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన మహిళలపై దౌర్జన్యాలకు సంబంధించిన కేసులను చేపట్టి, బాధితులకు కౌన్సిలింగ్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించడానికి, వారికి న్యాయం చేయడానికిఆసరా అనే సంస్థ ఏర్పాటయింది. ఈ సంస్థ ప్రప్రథమంగా ప్రత్యూష కేసును చేపట్టడానికి ముందుకు వచ్చింది.

ప్రత్యూషకు సంబంధించిన మెటీరియల్‌ను డిఎన్‌ఎ పరీక్షల కోసం సిడిఎఫ్‌డికి పంపాల్సిందిగా ఈ సంస్థ కోరింది. ఈ మేరకుఆసరా పోలీసు కమిషనర్‌కు, ఎపి స్టేట్‌ లీగల్‌సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌కు వినతి పత్రాలుఅందజేసింది. డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహిస్తే ప్రత్యూష కేసులో అయోమయం వీడిపోతుందని ఈ సంస్థ అభిప్రాయపడింది. ప్రముఖ సినీ నటి జయసుధ చైర్‌పర్సన్‌గా వున్న ఈ సంస్థలో శోభలత (మేకప్‌ ఉమన్‌), సునీత(గాయని), కోట శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భరద్వాజ (నిర్మాత) సభ్యులు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+