హైదరాబాద్‌ః హౌరా చెన్నై మధ్య నడుస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం నాడు మధ్యాహ్నం నెల్లూరుకు సమీపంలోని పడుగుపాడు వద్ద పట్టాలు తప్పింది.
12 బోగీలు చెల్లాచెదురయ్యాయి. నెల్లూరుస్టేషన్ దాటిన పదినిమిషాల్లోనే ఈ దారుణం జరిగింది. సుమారు 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని కొవ్వూరు, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. రెండు ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతినడంతో చెన్నై,విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.ప్రమాదం గురించిన సమాచారంఅందడంతోనే దక్షిణమధ్య రైల్వేకు చెందినసీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రయాణికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో చెన్నైపంపారు. సీరియస్‌గా వున్న ముగ్గురు ప్రయాణికులను నెల్లూరు ఆస్పత్రిలో చేర్చారు. ప్రమాదానికి కారణాలపైవిచారణ జరుపుతున్నట్టుగా అధికారులు తెలిపారు.