ప్రశాంతంగా ముగిసిన శిలాదాన్‌

అయోధ్యః యావత్‌ భారతావనిని కలవరపెట్టిన శిలాదాన్‌ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రశాంతంగా పూర్తయింది. వివాదాస్పద స్థలానికి సుమారు ఓ కిలోమీటరు దూరంలోని దిగంబర్‌ ఆఖరాలో శిలాదాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తొలుత రాం కోట్‌ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ శిలాదాన్‌ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే కరసేవకుల సంఖ్యను దృష్టిలో వుంచుకొని రామజన్మభూమి శిలాన్యాస్‌ అధ్యక్షుడు పరమహంస నివాసమైన దిగంబర్‌ అఖరాలోనే శిలాదాన్‌ ను నిర్వహించారు.వివాదస్పద స్థలానికి కాస్త దగ్గరలో వున్న రాం కోట్‌ లో శిలాదాన్‌ నిర్వహించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం వున్నదని అధికారులు పరమహంసకు,విశ్వహిందూ పరిషత్‌ సారధి అశోక్‌ సింఘాల్‌ కు నచ్చచెప్పినట్లు భావిస్తున్నారు. దీంతో పరమహంస ఇంటివద్దే శిలాదాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదట ఫైజాబాద్‌ డివిజినల్‌ కమిషనర్‌ గుప్తా శిలాదానాన్నిస్వీకరిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆఖరు నిమిషంలో ప్రధాని కార్యాలయంలో అయోధ్య వ్యవహారంపై ఏర్పాటు చేసిన ప్రత్యేకసెల్‌ ఇన్‌ ఛార్జ్‌ శతృఘన్‌ సింగ్‌ ను ఢిల్లీ నుంచి హుటాహుటిన అయోధ్యపంపారు. పరమహంస చేతుల మీదుగా శతృఘన్‌ సింగ్‌ శిలాదానాన్నిస్వీకరించారు.

కరసేవా పురం నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరమహంస,అశోక సింఘాల్‌ వెయ్యిమంది సాధువులు వెంటరాగా శిలాదాన స్థలానికి ఊరేగింపుగా బయలుదేరారు. దిగంబర్‌ అఖరా చేరుకున్న వెంటనే దానానికి ఉద్దేశించిన శిలలను అలకరించి, వేద మంత్రోచ్ఛాటనల మధ్య కేంద్ర ప్రభుత్వం పంపిన శతృఘన్‌ సింగ్‌ కుఅందజేశారు. శిలాదానం పూర్తయిన తరువాత కరసేవకులంతా ఒకరి తరువాత ఒకరువివాదాస్పద స్థలంలో నిర్మించిన రామాలయంలోకి వెళ్ళి పూజలు నిర్వహించారు.

అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కారణంగా అయోధ్య వీధులన్నీ బోసిపోయి కనిపించాయి. కనీసం 150 మంది కరసేవకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కరసేవకులు భద్రతా వలయాన్ని ఛేదించుకొని అయోధ్యలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా శిలాదాన్‌ కార్యక్రమం ముగిసిపోవడంతోసర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+