కేంద్రం పై విపక్షాల మండిపాటు
న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వహిందూ పరిషత్‌తో బాహటంగా కుమ్మక్కైందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుక్రవారం నాడు లోక్‌సభలో తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి ఎంపీల వత్తిడితో బెదిరిన ప్రభుత్వం సెక్యులర్ విలువలకు తిలోదకాలు వదిలిందని ఆమె ఆరోపించారు.
కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని ఆమెవిమర్శించారు. జాతీయ ప్రయోజనాలకు విరద్ధంగా మతతత్వ శక్తుల వత్తిడికి ప్రభుత్వం తలవొగ్గుతున్నదని ఆమె విరుచుకుపడ్డారు.విశ్వహిందూ పరిషత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోలేకపోయిందని ఆమెవిమర్శించారు. ప్రభుత్వ వైఖరికి కోర్టులో అటార్నీ జనరల్ వాదనే సాక్ష్యమని ఆమె అన్నారు. ఇదిలా వుండగా కేంద్ర ప్రభుత్వ దూత అయోధ్యలో శిలాదాన్‌నుస్వీకరించడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యసభలో తెలుగుదేశం నాయకులు రామచంద్రయ్య కూడా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగావిమర్శించారు. అయోధ్య వ్యవహారంలో ప్రభుత్వంవిశ్వహిందూ పరిషత్‌ను కోర్టు తీర్పును ఆమోదించాల్సిందిగా ప్రాధేయపడటం పట్ల ఆయనవిస్మయం వ్యక్తం చేశారు. మిత్రపక్షాలతో కనీసం సంప్రదించక పోవడాన్ని ఆయనవిమర్శించారు. ఈ శిలను ప్రభుత్వం ఏం చేస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి జైపాల్ ప్రశ్నించారు.సెక్యులర్‌గా వుండాల్సిన అధికారి మతకార్యక్రమంలో అధికారికంగా పాల్గొనడాన్ని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
