పరమహంతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని
న్యూఢిల్లీఃవివాదాస్పద స్థలంలో శిలాదాన్ కు అనుతించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన రామజన్మభూమి శిలాన్యాస్ అధినేత రామచంద్ర పరమహంసతో ప్రధాని వాజ్‌పేయి ఫోన్ లో మాట్లాడారు. ప్రధాని వాజ్ పేయితో పాటు, కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ లు పరమహంసతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి అఘాయిత్యాలకు, ఆందోళనలకు పాల్పడవద్దని వారు పరమహంసను కోరినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుత దశలో అయోధ్య వివాదాన్ని తట్టిలేపడం దేశానికి,ఎన్టీఏ ప్రభుత్వానికి, విశ్వహిందూ పరిషత్ ప్రతిష్ఠకు కూడా మంచిది కాదని ప్రధాని పరమహంసకు నచ్చచెప్పినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
