అయోధ్యలో ఆంక్షల ఎత్తివేత: కతియార్
అయోధ్య: విశ్వ హిందూ పరిషత్ శిలాదాన్ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో భద్రతాపరమైన ఆంక్షలు ఎత్తేసేవిషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని స్థానిక భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యుడు, భజరంగ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడువినయ్ కతియార్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగారైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు.
అయోధ్యలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోంది. గత పదిహేను రోజులుగా ఈ పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం చోటు చేసుకుంది. దుకాణాలను, వ్యాపార సంస్థలను తెరిచారు. ప్రజలు ఎప్పటిలా రోడ్లపైతిరుగుతున్నారు.












Click it and Unblock the Notifications
