అహ్మదాబాద్‌ః గుజరాత్‌లో తాజాగా చెలరేగిన అల్లర్లలో శనివారం నాడు ముగ్గురు మరణించారు. అహ్మదాబాద్, వడోదరాలో మళ్లీ హింసాకాండ చెలరేగింది.
రాజ్‌కోట్ విమానాశ్రయంలో భారీవిస్పోటనం సంభవించింది. అహ్మదాబాద్ దూబేశ్వర్ ప్రాంతంలో అల్లర్లకు దిగిన మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా మరో పదిమంది గాయపడ్డారు. దరైపూర్ ప్రాంతంలో జరిగిన మత ఘర్షణల్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా రాజ్‌కోటవిమానాశ్రయంలో రాకెట్లు వున్న ఒక పార్సెల్ పేలిపోయింది.ఇంకో కొన్ని గంటల్లో దానిని ముంబాయికి వెళ్లే ఎయిర్‌వేస్‌విమానంలోకి ఎక్కించాల్సివుండగా అది పేలిపోయింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వడోదరలో అల్లర్లు అదుపులో వున్నట్టుగా తెలిసింది.