చెన్నైః డిఎంకె శాసన సభ్యుడు, మాజీ రవాణా శాఖ మంత్రి పొన్ముడితో సహా ఆ పార్టీకి చెందిన పలువురి ఇళ్లపై ఎసిబి, సిబిసిఐడి మూకుమ్మడి దాడులు ప్రారంభించాయి.
గురువారం నాడుఅసెంబ్లీలో పొన్ముడి తనతో వాదనకు దిగినప్పుడే చట్ట సభ సాక్షిగా అంతుచూస్తానని హెచ్చరించిన జయలలితవిపక్ష నేతల ఇళ్లపైకి ఎసిబిని ఉసిగొల్పింది. ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం మొత్తం నలుభై చోట్ల దాడులు జరుగుతున్నట్టుగా తెలిసింది. పొన్ముడి ఆదాయానికిమించి ఆస్తులు సంపాదించారని తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు జరుపుతున్నట్టుగా ఎసిబి ప్రకటించింది. చైన్నైసైదాపేట, అన్నానగర్, విల్లుపురంలలో పొన్ముడికి చెందిన ఇళ్లపైనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో వున్న ఆయన అత్తగారి ఇళ్లపై కూడా ఏసిబి దాడులు జరిపింది. పొన్ముడి ఇంటిపైనే కాకుండాసురేష్ రాజన్, మరో మాజీ మంత్రి సమయనల్లూరుసెల్వరాజ్ ఇళ్లపై కూడా దాడులు జరిగినట్టుగా చెబుతున్నారు.