వంటగ్యాస్ ధర రూ.20 తగ్గింపు
న్యూఢిల్లీ:పెంచిన వంటగ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గించింది.పెంచిన ధరలో ఒక వంటగ్యాస్ సిలిండర్‌కు 20 రూపాయలు తగ్గిస్తున్నట్లుపెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయక్ శనివారం లోక్‌సభలో చెప్పారు. వంటగ్యాస్‌పై సబ్సిడీని క్రమంగా తగ్గించే యోచనలో భాగంగా సిలిండర్ ధరను 40 రూపాయలుపెంచిన విషయం తెలిసిందే.
వంటగ్యాస్, కిరోసిన్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడు డిమాండ్ చేశారు. తెలుగుదేశం వైఖరిని జెడి (యు) నేత దేవేంద్ర ప్రసాద్ యాదవ్ సమర్థించారు.
ఈ తగ్గింపు 6.3 కోట్ల పట్టణ, గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని రామ్‌నాయక్ చెప్పారు. ఈ తగ్గింపుతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఈ ఏడాదిలో 700 కోట్ల రూపాయలు వుంటుంది.












Click it and Unblock the Notifications
