కోర్టు వెలుపల అయోధ్య పరిష్కారం

న్యూఢిల్లీః గుజరాత్‌, అయోద్య సంక్షోభాలను ప్రభుత్వం ఎదుర్కున్న తీరుపట్ల ప్రధాని వాజ్‌పేయి సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షోభాలను తాము విజయవంతంగా అధిగమించినట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విజయం ఏ ఒక్కరి సొంతమూ కాదని ఆయన అన్నారు. గుజరాత్‌ హింసాకాండపై దర్యాప్తు జరిపేందుకు అఖిల పక్ష బృందాన్ని నియమిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. గుజరాత్‌ హింసాకాండను ఖండిస్తూ ఒక నేరం మరోనేరానికి సమర్ధింపు కాదని ఆయన స్పష్టం చేశారు. హింసాకాండ ఎలా ప్రారంభమైందని తర్జనభర్జనలు పడటానికి ఇది తగిన సమయం కాదని, బాధిత కుటుంబాలను ఆదుకోవడం తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.

డిసెంబర్‌ 13న పార్లమెంట్‌పై జరిగిన దాడులకు కారకులను ఇంతవరకు న్యాయస్థానం ఎదుట నిలబెట్టలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చనుఆయన ముగించారు. అయోధ్య సమస్యకు కోర్టు వెలుపల పరిష్కారం కనుక్కునే ప్రయత్నాలు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. కోర్టుల ద్వారా కాకుండా అన్ని పక్షాలకు ఆమోదయోగ్యంగా కోర్టు వెలుపలే ఈ సమస్యను పరిష్కరించాల్సి వున్నదని ఆయన అన్నారు. దేశంలో మతసామరస్య సాధనకు అయోధ్య ప్రధాన అడ్డంకిగా వుంటుందని ఆయన చెప్పారు. పార్లమెంట్‌పై దాడి యావత్‌ జాతికి ఒక సవాలు అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ పేరెత్తకుండా దోషులనుఅరెస్టులో పొరుగు దేశం సహకరించకపోవడం పట్ల ఆయనవిచారం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగం తర్వాత సభ మూజువాణి ఓటుతో ధన్యవాదాల తీర్మానాన్ని ఆమోదించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+