ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఒక ముఠా శుక్రవారం రాత్రి వరుసగా పెట్రోల్ బంక్‌ల దోపిడీకి పాల్పడింది. మారుతి కారులో వచ్చి ఈ ముఠా ఒక పథకం ప్రకారం పెట్రోల్ బంక్‌ల్లో లక్షలాది రూపాయల దోపిడీలకు పాల్పడింది.
ఒక పథకం ప్రకారం ముందే టెలిఫోన్ లైన్లను కట్ చేసి మారుతీ కారులో వచ్చి దోపిడీ చేసినట్లు చెబుతున్నారు. మారుతీకారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం.