న్యాయం జరిగింది: పివి
న్యూఢిల్లీ: తనను నిర్దోషిగా పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు హర్షం ప్రకటించారు. తనకు న్యాయం జరిగిందని ఆయన విలేకరులతో అన్నారు.
జెఎంఎం ముడుపుల కేసులో పి.వి. నరసింహారావును, ఆయన మంత్రి వర్గ సహచరుడు బూటాసింగ్‌ను దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. జెఎంఎం కేసులోని నిందితుడుశైలేంద్ర కుమార్ మహంతో అప్రూవర్‌గా మారి చెప్పిన సాక్ష్యం ఆధారంగా సిబిఐ ప్రత్యేక కోర్టు పివి నరసింహారావును, బూటాసింగ్‌లను దోషులుగా తేల్చింది. అయితే,శైలేంద్ర కుమార్ మహంతో తప్ప మరెవరూ సాక్ష్యులు లేకపోవడంతో పివిని, బూటాసింగ్‌ను నిర్దోషులుగాపేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేసును కొట్టేసింది.












Click it and Unblock the Notifications
