అయోధ్యపై దేశంఘాటైన విసుర్లు
న్యూఢిల్లీ: అయోధ్యవిషయంలో తెలుగుదేశం పార్టీ వాజ్‌పేయి ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేసింది. ఇలా మీరు తప్పుడు విధానాలను ఎంచుకుంటూ పోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయి అని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడుసి. రామచంద్రయ్య శుక్రవారం రాజ్యసభలో వాజ్‌పేయి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మీకు మేం ప్రాణవాయువు అందజేస్తున్నాం.మీ నుంచి మంచి పనులు ఆశిస్తున్నాం అని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆర్థిక ఎజెండా, బడ్జెట్లపై కూడా ఆయనఘాటైన విమర్శలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితికిబడ్జెట్ అద్దం పట్టిందని ఆయన అన్నారు. తొమ్మిదో పంచ వర్ష ప్రణాళికలో నిర్దేశిత లక్ష్యాలనుచేరుకోలేకపోయామని ఆయన అన్నారు. ఉద్యోగలు సంఖ్య కుదింపు, పెట్టుబడుల ఉపసంహరణ వంటి చర్యలు తాత్కాలకి ప్రయోజనాలను మాత్రమే చేకూర్చి పెడతాయని ఆయన అన్నారు. సంస్కరణలను భారతీయీకరించాలని, వ్యవసాయ ఉత్పాదననుపెంచాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
